అప్పుడు ఉరి.. ఇప్పుడు ఛావా
ABN , Publish Date - Feb 18 , 2025 | 01:21 AM
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌కు రెండు అక్షరాల టైటిల్స్ కలసి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఛావా’ అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఇంతకుముందు చారిత్రక కథాంశాలతో...
బాలీవుడ్‌కు తొలి బోణి ఫ మూడు రోజుల్లో రూ. వంద కోట్లు
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌కు రెండు అక్షరాల టైటిల్స్ కలసి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఛావా’ అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఇంతకుముందు చారిత్రక కథాంశాలతో వచ్చిన ‘తానాజీ’, ‘కేసరి’ చిత్రాలకంటే ఈ నెల 14న విడుదలైన ‘ఛావా’ కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండడం దర్శకనిర్మాతల్లో ఉత్సాహాన్ని పెంచింది. అజయ్ దేవగన్, సైఫ్ అలీఖాన్ నటించిన ‘తానాజీ’ చిత్రం తొలి రోజున కేవలం రూ. 15 కోట్లే వసూలు చేసింది. అలాగే అక్షయ్‌కుమార్, పరిణితి చోప్రా నటించిన ‘కేసరి’ చిత్రం మొదటి రోజున రూ. 21.06 కోట్లకే పరిమితం కాగా, ‘ఛావా’ తొలి రోజు రూ. 31 కోట్లు వసూలు చేసి ముందు వరుసలో నిలిచింది.
బాలీవుడ్‌కు కొత్త ఊపిరి
కొత్త సంవత్సరంలో తొలి నెల బాలీవుడ్‌కు అంతగా కలసి రాలేదనే చెప్పాలి. అక్షయ్‌కుమార్ నటించిన ‘స్కై ఫోర్స్’, కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’, సోనూ సూద్ నటించిన ‘ఫతే’ చిత్రాలు పరవాలేదనిపించాయి కానీ ‘అబ్బో’ అని గొప్పగా చెప్పుకొనేంత విజయాలు అందించలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన మూడు చిత్రాలు ‘దేవా’, ‘లవ్ యాపా’, ‘ఆజాద్’ సినిమాలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక పోయాయి. వరుస అపజయాలతో నిరాశలో మునిగిన బాలీవుడ్‌కు ‘ఛావా’ చిత్రానికి వస్తున్న వసూళ్లు కొత్త ఊపిరినిచ్చాయి. కొత్త సంవత్సరంలో బిగ్గెస్ట్ ఓపెనర్ ఇదేనని బీ టౌన్ వర్గాలు పేర్కొంటున్నాయి. బాలీవుడ్‌లో మొదటి నాలుగు రోజుల వసూళ్లలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ఫ 2’ చిత్రమే ఇప్పటికి టాప్. ‘ఛావా’ సినిమా ఆ వసూళ్లను అధిగమించి ముందు వరుసలో నిలిచింది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘ఛావా’ చిత్రంలో విక్కీ శంభాజీ పాత్ర పోషించారు. ఆయన భార్యగా రష్మిక నటించారు. అందరూ ఊహించినట్లుగానే మహారాష్ట్ర సర్క్యూట్‌లో ఈ సినిమా దుమ్ము దులుపుతోంది. రూ. 130 కోట్ల బడ్జెట్‌తో తయారైన ఈ చిత్రం తొలి రెండు రోజుల్లో రూ. 60 కోట్లు వసూలు చేసింది. మూడో రోజుకే రూ. వంద కోట్ల క్లబ్‌లో చేరి రూ. 108 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. కలెక్షన్ల ఉదృతి ఇలాగే కొనసాగితే పీరియడ్ డ్రామా చిత్రాల్లో ‘ఛావా’ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.
సినిమా మీద మొదటి నుంచి సోషల్ మీడియాలో పాజిటివ్ పబ్లిసిటీ జరగడం, అక్షయ్ ఖన్నా, రష్మిక, అషుతోష్ రాణా, దివ్య దత్తా వంటి స్టార్స్ నటించడం వంటి అంశాలు ‘ఛావా’ సినిమాకు కలిసొచ్చి ప్రేక్షకులను థియేటర్లకు లాక్కెళ్లాయి. భారీ ఓపెనింగ్స్ తెచ్చి పెట్టాయి.
విక్కీకి ఇది రెండో హయ్యెస్ట్ గ్రాసర్
హీరో విక్కీ నటించిన ‘ఉరి.. ద సర్జికల్ స్టైక్’ దాదాపు రూ. 240 కోట్లు వసూలు చేసింది. అలియా భట్‌తో కలసి నటించిన ‘రాజీ’ చిత్రం అటుఇటుగా రూ. 123 కోట్లు వసూలు చేసి ఆయనకి రెండో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలించింది. కానీ సోమవారం సాయంత్రానికే ‘ఛావా’ రూ. 124 కోట్లు వసూలు చేసి, ‘రాజీ’ని దాటేసి రెండో స్థానంలో నిలిచింది. ఈ వారం ‘ఛావా’ చిత్రానికి పోటీగా వచ్చే కొత్త సినిమాలు ఏవీ లేకపోవడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
రష్మికకు మరో భారీ హిట్
‘పుష్ప’ చిత్రంతో ఉత్తరాదిలో అలజడి సృష్టించి, ఆలిండియా క్రష్‌గా మారిన రష్మిక ఖాతాలో ఇప్పుడు మరో భారీ హిట్ పడింది. కాలికి గాయమైనప్పటికీ వీల్ ఛైర్‌లో కూర్చుని ‘ఛావా’ ప్రమోషన్స్‌కు ఆమె హాజరు కావడం కూడా ప్రేక్షకుల్ని కదిలించిందనే చెప్పాలి. శంభాజీ భార్య యేసు బాయిగా సినిమాలో ఆమె పాత్ర పరిధి తక్కువే అయినా ఉన్నంత కాసేపు బాగా నటించిందనే పేరు రష్మికకు వచ్చింది.
ఆ రోజు మరో రూ.యాభై కోట్లు వచ్చేనా?
బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి. మహారాష్ట్రలో దీన్ని చాలా ఘనంగా జరుపుతారు. శివాజీ తనయుడు శంభాజీ కథతో రూపొందిన చిత్రం ‘ఛావా’ కనుక ఆ రోజు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆ ఒక్క రోజే రూ. 50 కోట్లు వసూలు చేస్తే ఇక ‘ఛావా’కు తిరుగే లేదు.
ఇవీ చదవండి:
ప్రాక్టీస్ మొదలుపెట్టిన క్రికెట్ గాడ్.. ఫ్యాన్స్‌కు పండగే
రోహిత్ తిరుగులేని వ్యూహం.. పక్కా స్కెచ్‌తో
ధోని నుంచి రోహిత్ ఎరా వరకు.. డాక్యుమెంటరీ చూశారా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి