భావోద్వేగాలు అలరిస్తాయి
ABN , Publish Date - Mar 26 , 2025 | 02:32 AM
మాధవన్, నయనతార, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ ప్రధాన తారాగణంగా రూపొందిన క్రీడా నేపథ్య చిత్రం ‘టెస్ట్’. ఎస్. శశికాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు....
మాధవన్, నయనతార, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ ప్రధాన తారాగణంగా రూపొందిన క్రీడా నేపథ్య చిత్రం ‘టెస్ట్’. ఎస్. శశికాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఏప్రిల్ 4న తెలుగు, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకొస్తోంది. మేకర్స్ మంగళవారం ట్రైలర్‌ను విడుదలచేశారు. ఈ సందర్భంగా మాధవన్ మాట్లాడుతూ ‘అందరినీ కట్టిపడేసే భావోద్వేగాలు, అదరగొట్టే యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రంలో మిళితమై ఉంటాయి’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘క్రికెట్ ఆట నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంగా మాత్రమే దీన్ని చూడొద్దు. సినిమాలో అంతకు మించి ఉంది. జీవితంలోని ఎత్తుపల్లాలు, మానవీయ విలువలను ప్రతిబింబించే కథ ఇది’ అన్నారు.