మూడో భాగంతో మళ్లీ వస్తాం

ABN , Publish Date - Mar 23 , 2025 | 05:13 AM

మలయాళ నటుడు మోహన్‌లాల్‌ హీరోగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్‌2:ఎంపురాన్‌’. ఆంటోనీ పెరుంబపూర్‌, గోకులం గోపాలన్‌ నిర్మించారు. ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది...

మలయాళ నటుడు మోహన్‌లాల్‌ హీరోగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్‌2:ఎంపురాన్‌’. ఆంటోనీ పెరుంబపూర్‌, గోకులం గోపాలన్‌ నిర్మించారు. ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మోహన్‌లాల్‌ మాట్లాడుతూ సినీ ప్రయాణంలో తెలుగు చిత్ర సీమతో ఎంతో అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావుతో నటించే అదృష్టం నాకు దక్కింది. పృథ్వీరాజ్‌ ఈ చిత్రంతో తెరపై అద్భుతం చేశారు. ‘లూసిఫర్‌’ను మూడు భాగాలుగా తీయాలని అనుకున్నాం. ‘ఎంపురాన్‌’ విజయవంతమైతే మూడో భాగంతో మళ్లీ వస్తాం. పాలిటిక్స్‌, యాక్షన్‌, ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి’ అని తెలిపారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మాట్లాడుతూ ‘ఇది ఎక్కడా డబ్బింగ్‌ చిత్రంలా అనిపించదు. నా దృష్టిలో మంచి సినిమా చెడ్డ సినిమా అనేది మాత్రమే ఉంటుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు. నేను మంచి సినిమా తీశానని నమ్ముతున్నాను’ అని అన్నారు. నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ ‘పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పాన్‌ ఇండియా డైరెక్టర్‌ కాబోతున్నారు. అన్ని భాషల్లో ఈ చిత్రం పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 05:14 AM