ఆకట్టుకునే పాటలతో...

ABN , Publish Date - Mar 26 , 2025 | 02:29 AM

డాక్టర్‌ సాయివెంకట్‌ టైటిల్‌ పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘జయహో రామానుజ’. జో శర్మ కథానాయిక. సుమన్‌ కీలకపాత్రలో నటించారు...

డాక్టర్‌ సాయివెంకట్‌ టైటిల్‌ పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘జయహో రామానుజ’. జో శర్మ కథానాయిక. సుమన్‌ కీలకపాత్రలో నటించారు. సాయిప్రసన్న, ప్రవల్లిక నిర్మించారు. త్వరలో పలు భారతీయ భాషల్లో ఈచిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మంగళవారం చిత్రబృందం హైదరాబాద్‌లో ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. సాయివెంకట్‌ మాట్లాడుతూ ‘తెలుగు ప్రజలకు రామానుజాచార్యుల గొప్పదనాన్ని తెలియజేసేందుకు ఈ సినిమా చేశాను. ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి’ అని చెప్పారు. ప్రవల్లిక మాట్లాడుతూ ‘భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది’ అని తెలిపారు.

Updated Date - Mar 26 , 2025 | 02:29 AM