The Devil’s Chair: ‘ది డెవిల్స్ చైర్’ ఫస్ట్ లుక్ వచ్చింది చూశారా..
ABN , Publish Date - Jan 23 , 2025 | 10:30 PM
The Devil’s Chair First Look: టాలీవుడ్ సరైన హారర్ సినిమా పడి చాలా రోజులు అవుతుందని అంటున్నారు ‘ది డెవిల్స్ చైర్’ మూవీ యూనిట్. ఈ హరర్ చిత్ర ఫస్ట్ లుక్‌ని గురువారం మేకర్స్ విడుదల చేశారు. టైటిల్‌కి తగ్గట్టే ఈ పోస్టర్ చూడగానే సినిమాపై ఆసక్తిని కనబరుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్ మరియు సిఆర్‌ఎస్ క్రియేషన్స్ పతాకం పై జబర్దస్త్ అభి, ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘ది డెవిల్స్ చైర్’. యంగ్ టాలెంటెడ్ దర్శకుడు గంగ సప్త శిఖర దర్శకత్వంలో కెకె చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి మరియు చంద్ర సుబ్బ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని గురువారం మేకర్స్ విడుదల చేశారు. ప్రధాన పాత్రలన్నింటినీ రివీల్ చేస్తూ వచ్చిన ఈ పోస్టర్‌లో.. టైటిల్‌కి తగ్గట్టే చైర్‌కి ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ చైర్ సినిమాను నడుపుతుందనే విషయాన్ని పోస్టర్ స్పష్టంగా తెలియజేస్తుంది.
Also Read- Kumbh Mela Monalisa: మహా కుంభమేళా మోనాలిసాకు బంపరాఫర్..
ఇక ఈ పోస్టర్ విడుదల సందర్భంగా దర్శకుడు గంగ సప్త శిఖర మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో సరైన హారర్ చిత్రం వచ్చి చాలా రోజులు అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా మంచి హారర్ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. హారర్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు మా ‘ది డెవిల్స్ చైర్’ పర్ఫెక్ట్ సినిమా అని కచ్చితంగా చెప్పగలను. సరికొత్త పాయింట్‌తో టెక్నికల్‌గా హైస్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని అన్నారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘ది డెవిల్స్ చైర్’ మంచి కంటెంట్ ఉన్న సినిమా. అద్భుతమైన ఏఐ టెక్నాలజీతో సరికొత్త కథ, కథనాలతో నిర్మిస్తున్నాము. ప్రతి సీన్‌ను అద్భుతంగా రిచ్ విజువల్స్‌తో రూపొందిస్తున్నాం. ప్రస్తుతం షూటింగ్ అంతా పూర్తయింది. చిత్రాన్ని 2025 ఫిబ్రవరి చివరివారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.