ప్రతీ పాటకు ఆ పద్ధతి సరికాదు
ABN , Publish Date - Jan 10 , 2025 | 06:19 AM
‘సలార్’, ‘రాధేశ్యామ్’, ‘సీతారామం’ వంటి సూపర్‌హిట్ సినిమాల్లో రాసిన పాటలతో గుర్తింపు తెచ్చుకున్న గీత రచయిత కె.కె(కృష్ణకాంత్). ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’ చిత్రాలకు పాటలు రాస్తున్న కె.కె.. గురువారం...
‘సలార్’, ‘రాధేశ్యామ్’, ‘సీతారామం’ వంటి సూపర్‌హిట్ సినిమాల్లో రాసిన పాటలతో గుర్తింపు తెచ్చుకున్న గీత రచయిత కె.కె(కృష్ణకాంత్). ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’ చిత్రాలకు పాటలు రాస్తున్న కె.కె.. గురువారం మీడియాతో ముచ్చటించారు. ‘‘డైరెక్ట్‌గా పాటలు రాయడం కంటే డబ్బింగ్ సినిమాలకు పాటలు రాయడం సవాలుతో కూడుకున్నది. సినిమాకు ఓ పాట లేదా రెండు పాటలు రాయడం కంటే సింగిల్ కార్డ్ రాయడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇప్పుడు ప్రతీ మ్యూజిక్ డైరెక్టర్ హుక్ లైన్స్ కోరుతున్నాడు. ఆ ఒత్తిడి గీత రచయితలందరిపై ఉంటోంది. అయితే, ఈ హుక్ లైన్ ట్రెండ్ అన్ని పాటలకు సరికాదు’’ అని చెప్పారు.