ఆ నమ్మకం ఉంది

ABN , Publish Date - Apr 11 , 2025 | 06:14 AM

రచిత మహాలక్ష్మి, సాత్విక్‌, సాహిత్య ప్రధాన పాత్రలు పోషించిన ‘తల్లి మనసు’ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది...

రచిత మహాలక్ష్మి, సాత్విక్‌, సాహిత్య ప్రధాన పాత్రలు పోషించిన ‘తల్లి మనసు’ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. వి.శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 14 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుందని నిర్మాత ముత్యాల అనంతకిశోర్‌ చెప్పారు. ఈ చిత్ర సమర్పకుడు, సీనియర్‌ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ ‘చాలా కాలం తర్వాత ఓ మంచి చిత్రాన్ని చూశామని ప్రేక్షకులు చెప్పడం మాకు ఆనందం కలిగించింది. ఇప్పుడు ఓటీటీ వేదిక ద్వారా మిగిలిన ప్రేక్షకులకు దగ్గరైతే మేం ఏం ఆశించామో ఆ లక్ష్యం నెరవేరుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 06:14 AM