తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు
ABN , Publish Date - Mar 23 , 2025 | 05:09 AM
విక్రమ్, దుషార విజయన్ జంటగా ఎస్.యు.అరుణ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీర ధీర శూర’. హెచ్.ఆర్. పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు నిర్మించారు. ఎస్.జె.సూర్య, సూరజ్ వెంజరాముడు కీలక పాత్రలు పోషించారు...
విక్రమ్, దుషార విజయన్ జంటగా ఎస్.యు.అరుణ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీర ధీర శూర’. హెచ్.ఆర్. పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు నిర్మించారు. ఎస్.జె.సూర్య, సూరజ్ వెంజరాముడు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం తెలుగు రైట్స్‌ని ఎన్.వి.ఆర్ సినిమా దక్కించుకుంది. ఈనెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ మాట్లాడుతూ ‘మాస్ సినిమాలు చేస్తున్నాను కానీ రస్టిక్‌గా ఉండే సినిమా చేసి చాలా రోజులైంది. యాక్షన్‌తో పాటు మంచి ఎమోషన్ ఉన్న సినిమా ఇది. డైరెక్టర్ అరుణ్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఫస్ట్ షాట్ నుంచే కథ మొదలవుతుంది. థియేటర్లలో ఆట ప్రారంభాని కంటే ఐదు నిమిషాల ముందే సీట్లలో కూర్చోవాలని ప్రేక్షకులను కోరుతున్నా. తెలుగులో అన్ని రకాల సినిమాలు అద్భుతమైన విజయాన్ని సాధిస్తున్నాయి’ అని అన్నారు. నటుడు ఎస్.జె.సూర్య మాట్లాడుతూ ‘మంచి కంటెంట్ ఎక్కడున్నా సరే తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ‘రంగస్థలం’ లాంటి రా అండ్ రస్టిక్ సినిమా ఇది. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అని అన్నారు. నిర్మాత ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ ‘మహారాజా’ తర్వాత తెలుగులో చేస్తున్న సినిమా ఇది. కచ్చితంగా హిట్ అవుతుంది. ప్రేక్షకులు కోరుకుంటున్న ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి’ అని అన్నారు.