క్లైమాక్స్‌లో కన్నీళ్లొచ్చాయి
ABN , Publish Date - Jan 08 , 2025 | 02:54 AM
అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి, మేఘన శ్రీనివాస్, వినయ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘1000 వర్డ్స్’. రమణ విల్లర్ట్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. హైదరాబాద్‌లో ప్రదర్శించిన మూవీ స్పెషల్ షోకు రేణూ దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మధుర శ్రీధర్, జ్యోతి పూర్వజ్, సుకు పూర్వజ్....
అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి, మేఘన శ్రీనివాస్, వినయ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘1000 వర్డ్స్’. రమణ విల్లర్ట్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. హైదరాబాద్‌లో ప్రదర్శించిన మూవీ స్పెషల్ షోకు రేణూ దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మధుర శ్రీధర్, జ్యోతి పూర్వజ్, సుకు పూర్వజ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా రేణూ దేశాయ్ మాట్లాడుతూ ‘మూవీ అద్భుతంగా ఉంది. క్లైమాక్స్ చూశాక నాకు కన్నీళ్లొచ్చాయి. ఇంత మంచి సినిమాను తీసిన టీమ్‌కు ఆల్ ద బెస్ట్’ అని అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘ఈ చిత్రం అందరినీ కంటతడి పెట్టించింది. ప్రతి ఒక్కరి హృదయాలను కుదిపేస్తుంది. ఈ చిత్రానికి కచ్చితంగా అవార్డులు వస్తాయి’ అని అన్నారు.
‘ఈ మూవీ నాకెంతో ప్రత్యేకం. సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని హీరో అరవింద్ కృష్ణ అన్నారు. చిత్ర దర్శకనిర్మాత రమణ విల్లర్ట్ మాట్లాడుతూ ‘ఓ తల్లి బిడ్డను కనేటప్పుడు పడే బాధను చూపించాలనే తపనతో ఈ సినిమా తీశాము. అమ్మ పాత్రలో మేఘన అద్భుతంగా నటించారు’ అని అన్నారు.