ఐసే చడా హై నషా
ABN , Publish Date - Apr 11 , 2025 | 06:17 AM
ఇప్పటికే పలు చిత్రాల్లో హుషారైన ప్రత్యేక గీతాల్లో నర్తించి అభిమానులను అలరించారు తమన్నా భాటియా. ఇప్పుడు మరోసారి ఆమె బాలీవుడ్‌లో ప్రత్యేక ...
ఇప్పటికే పలు చిత్రాల్లో హుషారైన ప్రత్యేక గీతాల్లో నర్తించి అభిమానులను అలరించారు తమన్నా భాటియా. ఇప్పుడు మరోసారి ఆమె బాలీవుడ్‌లో ప్రత్యేక గీతంతో మెరవబోతున్నారు. అజయ్ దేవ్‌గణ్ కథానాయకుడిగా నటించిన ‘రైడ్ 2’ చిత్రంలో ప్రత్యేకగీతం చేశారు తమన్నా. చిత్రబృందం గురువారం ఆ పాటకు సంబంధించిన ప్రోమోను సోషల్ మీడియాలో విడుదల చేయగా వైరల్ అయింది. పూర్తి పాటను నేడు విడుదల చేయనున్నారు. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సైతం నటించారు. జైలర్ చిత్రంలోని ‘నువ్వే కావాలయ్యా’ పాట తరహాలో నషా సాంగ్ కూడా అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయం అనే అభిప్రాయం తమన్నా అభిమానుల నుంచి వినిపిస్తోంది. మే 1న విడుదలవుతున్న ఈ చిత్రంలో వాణీకపూర్ కథానాయిక. రితేశ్ దేశ్‌ముఖ్, సుప్రియా పాఠక్ కీలకపాత్రలు పోషించారు.