గొప్ప అనుభూతిని ఇస్తుంది: నిర్మాత మధు

ABN , Publish Date - Apr 12 , 2025 | 01:08 AM

తమన్నా భాటియా ప్రధాన పాత్రలో 'ఓదెల-2' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ప్రతి పాత్రకీ ప్రాధాన్యం ఉందని నిర్మాత మధు చెప్పారు

తమన్నా భాటియా ప్రధాన పాత్రలో దర్శకుడు సంపత్‌ నంది పర్యవేక్షణలో అశోక్‌ తేజ తెరకెక్కించిన చిత్రం ‘ఓదెల-2’. ‘ఓదెల రైల్వే స్టేషన్‌’కి సీక్వెల్‌ చిత్రమిది. డి.మధు నిర్మించారు. ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత మధు మీడియాతో చిత్ర విశేషాలను పంచుకొన్నారు. ‘నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ప్రాణం. కమర్షియల్‌గా కాకుండా సినిమాపై ప్యాషన్‌తోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. నాకు మొదటి నుంచి ఏదైనా వెరైటీగా చేయాలని ఉండేది. కాశీలో ఈ సినిమాని ప్రారంభించాం. అలాగే మహా కుంభమేళాలో టీజర్‌ని లాంచ్‌ చేసాం. సినిమాలో తమన్నా అద్భుతంగా నటించారు. ఏప్రిల్‌, మే నెలల్లో చెప్పులు వేసుకోకుండానే ఎర్రటి ఎండలో షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమా కథలో ప్రతి పాత్రకీ ప్రాధాన్యం ఉంటుంది. ప్రేక్షకులు ఆ పాత్రలతో లీనం అయిపోతారు. గొప్ప అనుభూతిని పొందుతారు’ అని అన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 01:10 AM