అది నా అదృష్టం
ABN , Publish Date - Mar 23 , 2025 | 05:06 AM
హీరోయిన్ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల-2’. సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్నారు..
హీరోయిన్ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల-2’. సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల కానుంది. శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో తమన్నా మాట్లాడుతూ ‘‘ఓదెల-2’ చిత్రం ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమాలో భైరవి పాత్రలో నటించడం నా అదృష్టం’ అని అన్నారు. సంపత్ నంది మాట్లాడుతూ ‘ఓదెల గ్రామంలో ఒక కష్టం వస్తే ఆ ఊరిలో ఉన్న ఓదెల మల్లన్న నాగ సాధు క్యారెక్టర్ ద్వారా ఎలా పరిష్కరించారనేది ఈ చిత్ర కథ’ అని తెలిపారు. నిర్మాత డి.మధు మాట్లాడుతూ ‘కంటెంట్‌ని నమ్ముకొని ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించాం’ అని చెప్పారు.