వజ్రానికి స్వాగతం
ABN , Publish Date - Apr 11 , 2025 | 06:18 AM
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం విదితమే. తాజాగా ఈ సినిమాలో...
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం విదితమే. తాజాగా ఈ సినిమాలో టబు భాగమయ్యారు. ఈ మేరకు చిత్రనిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ ఆమెను ఆహ్వానిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. భారతీయ చలనచిత్ర రంగంలో వజ్రంలాంటి టబుకు స్వాగతం అని పూరి కనెక్ట్స్ పేర్కొంది. ఈ చిత్రంలో ఆమె కోసం ఓ అద్భుతమైన పాత్ర సిద్ధంగా ఉంది అని తెలిపింది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ను జూన్‌లో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.