Shambhala: సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ హీరోయిన్ లుక్ వదిలారు

ABN , Publish Date - Feb 08 , 2025 | 10:16 PM

ఆది సాయి కుమార్ హీరోగా రూపొందుతోన్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల ఏ మిస్టిక్ వరల్డ్’. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా.. తాజాగా ఈ చిత్రంలోని హీరోయిన్ లుక్‌ని మేకర్స్ వదిలారు. ఈ లుక్ ఎలా ఉందంటే..

Shambhala Heroine Swasika

‘‘లబ్బర్ పందు, పొరింజు మరియం జోస్, సత్తై, అయలుం నానుమ్ తమ్మిల్, ఇష్క్, శుభరాత్రి, వాసంతి, ఆరాట్టు, సీబీఐ 5, కుమారి’’ మొదలైన తమిళ, మలయాళ భాషల్లో నటించి నటిగా స్వాసిక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఎన్నో కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌లను తన ఖాతాలో వేసుకున్న స్వాసిక ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఆది సాయి కుమార్ హీరోగా రూపొందుతోన్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల ఏ మిస్టిక్ వరల్డ్’. ఈ సినిమాలో స్వాసిక హీరోయిన్‌గా నటించారు. తాజాగా స్వాసిక ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.


Also Read- Akhanda 2 Thandavam: ‘అఖండ 2: తాండవం’‌కి విలన్‌గా ‘సరైనోడు’ పడ్డాడులే..

ఈ సినిమాను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి స్వాసిక ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. వసంత పాత్రలో స్వాసిక శంబాల చిత్రంలో కనిపించనుంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఎరుపు రంగు చీరలో స్వాసిక కనిపించిన తీరు.. ఆమె చూపులు, చుట్టూ ఉన్న వాతావరణం, పక్షి, దిష్టిబొమ్మ ఇలా అన్నింటినీ చూస్తుంటే సినిమా మీద మరింత ఆసక్తి ఏర్పడుతోంది.


Shambhala-Heroine.jpg

Also Read- Chiranjeevi: ఓ మహిళ చెడమడా తిట్టేశారు.. ఎవరా అని ఆరా తీస్తే?

ఈ చిత్రంలో పాటు స్వాసిక స్టార్ హీరో సూర్య 45వ చిత్రంలోనూ అవకాశం సొంతం చేసుకున్నారు. అలాగే నితిన్ హీరోగా వస్తున్న ‘తమ్ముడు’ చిత్రంలోనూ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ‘శంబాల’ విషయానికి వస్తే.. ఈ చిత్రం సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రాబోతోంది. ఈ మూవీలో ఆది సాయి కుమార్ భౌగోళిక శాస్త్రవేత్తగా ఓ ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ ప్రధాన ఆకర్షణ కానున్నాయని.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో శంబాల సినిమాను చిత్రీకరిస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు.


Also Read- Sankranthiki Vasthunam OTT: ఓటీటీలోకి 'సంక్రాంతికి వస్తున్నాం' ఎక్కడ, ఎప్పుడంటే..

Also Read- Oka Pathakam Prakaaram Review: 'ఒక పథకం ప్రకారం' పూరీ తమ్ముడికి హిట్‌ ఇచ్చిందా..

Also Read- Thandel Review: నాగ చైతన్య తండేల్ మూవీ రివ్యూ 

Also Read- Samantha: మాజీ భర్త మళ్లీ పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 08 , 2025 | 10:16 PM