Swapnala Naava: 'సిరివెన్నెల'కు నివాళిగా 'స్వప్నాల నావ’
ABN , Publish Date - Feb 21 , 2025 | 09:52 AM
'మనసంతా నువ్వే', 'నేనున్నాను' వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వి.ఎన్.ఆదిత్య (V. N. Aditya) తాజాగా స్వప్పాల నావ’ (Swapnaala Naava) అనే ప్రాజెక్ట్ చేశారు.
'మనసంతా నువ్వే', 'నేనున్నాను' వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వి.ఎన్.ఆదిత్య (V. N. Aditya) తాజాగా స్వప్పాల నావ’ (Swapnaala Naava) అనే ప్రాజెక్ట్ చేశారు. డల్లాస్‌కి చెందిన ప్రవాసాంధ్రుడు గోపీకృష్ణ కొటారు ‘శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ఓ వీడియో రూపొందించారు నిర్మాత గోపికృష్ణ కుమార్తె శ్రీజ కొటారు(Srija Kotaru) . ఆమె ఈ పాటను ఆలపించడమే కాకుండా నర్తించడం కూడా విశేషం.
‘స్వప్నాల నావ’ థీమ్ విషయానికి వస్తే ఇది దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి దివ్య స్మృతికి అంకితంగా దర్శకుడు వి.ఎన్.ఆదిత్య తీర్చిదిద్దారు. ఓ.ఎమ్.జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత శ్రీమతి మీనాక్షి అనిపింది సమర్పకులుగా వ్యవహరించారు. గాయకుడు, సంగీత దర్శకుడు పార్థసారథి నేమాని సంగీత దర్శకత్వంలో యశ్వంత్ సాహిత్యం అందించారు. (Tribute To Sirivennela Seetharama Sastry)
‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ అంటే వి.ఎన్.ఆదిత్యకు ఎంతో అభిమానం. ఆయన సూపర్ హిట్ సినిమా ‘మనసంతా నువ్వే’లో సిరివెన్నెల గుర్తుండిపోయే ఓ పాత్ర పోషించారు. ఇప్పుడు ‘స్వప్నాల నావ’తో సిరివెన్నెల గొప్పతనాన్ని, ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పారు ఆదిత్య. ప్రస్తుతం ఈ వీడియోకి ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వస్తుంది. తాజాగా యూట్యూబ్‌లో ఈ పాటకు వన్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. దీంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తూ వీక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో సిరివెన్నెలకు ఇచ్చిన గొప్ప ట్రిబ్యూట్ అని సంగీత ప్రియుడు ప్రశంసలు కురిపిస్తున్నారు.