Happy Birthday: సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ లో సుశాంత్
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:17 PM
హీరో సుశాంత్ ఇప్పుడో సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది అతను నటిస్తున్న 10వ చిత్రం.
అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ అనుమోలు (Sushanth Anumolu) బర్త్ డే మార్చి 18న. ఈ సందర్భంగా అతని కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన ఓ పోస్టర్ తో పాటు వచ్చింది. 2008లో 'కాళిదాసు' (Kaalidasu) మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్... కొంతకాలంగా సోలో హీరోగానే కాకుండా ప్రాధాన్యమున్న పాత్రలనూ చేస్తున్నాడు. అలా వచ్చిన 'అల వైకుంఠపురములో' (Ala Vaikunatapuramulo) అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 'రావణాసుర' (Ravanasura), 'భోళాశంకర్' (Bhola Shankar) చిత్రాలలో నటించాడు. కానీ ఇవి కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ఇప్పుడు సుశాంత్ మరోసారి సోలో హీరోగా ఓ సూపర్ నేచురల్ మిస్టరీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వరుణ్ కుమార్, రాజ్ కుమార్ నిర్మిస్తున్న ఈ మూవీకి పృథ్వీరాజ్ చిట్టేటి రచన చేసి దర్శకత్వం వహిస్తున్నారు. సుశాంత్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన మూవీ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. సుశాంత్ ఇందులో రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నాడు. ఒక దానిలో స్టైలిష్, ఇంటెన్స్ అవతార్ లో కనిపించారు. అలానే దానికి మరోవైపు పూర్తి భిన్నంగా సుశాంత్ కనిపిస్తున్నారు. సుశాంత్ ఇందులో ఎక్సర్సిస్ట్ పాత్రను పోషిస్తున్నారని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి అనిరుధ్ కృష్ణమూర్తి స్క్రీన్‌ప్లే రాయడంతో పాటు, దర్శకుడు పృథ్వీరాజ్ చిట్టేటితో కలిసి డైలాగ్స్ అందించారు. వైవిబి శివ సాగర్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఆశిష్ తేజ పులాల ఆర్ట్ డైరెక్టర్.
Also Read: Prithviraj: ఫ్యాన్‌బాయ్ మూమెంట్ అంటూ పృథ్వీరాజ్ పోస్ట్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి