దేశం మొత్తం ఆశ్చర్యపోతుంది

ABN , Publish Date - Mar 26 , 2025 | 02:46 AM

‘పుష్ప-2’ ఘన విజయం తర్వాత అల్లు అర్జున్‌ చేయబోయే సినిమాలపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ చేతిలో అట్లీ, త్రివిక్రమ్‌, సందీ్‌పరెడ్డి వంగా సినిమాలు ఉన్నాయి...

‘పుష్ప-2’ ఘన విజయం తర్వాత అల్లు అర్జున్‌ చేయబోయే సినిమాలపై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ చేతిలో అట్లీ, త్రివిక్రమ్‌, సందీ్‌పరెడ్డి వంగా సినిమాలు ఉన్నాయి. అయితే వీటిలో తొలుత ఏది సెట్స్‌పైకి వెళ్తుందనే విషయమై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. అట్లీ చిత్రం పక్కా కమర్షియల్‌ అని, అలాగే త్రివిక్రమ్‌ తెరకెక్కించనున్న సినిమాలో అల్లు అర్జున్‌ది సుబ్రమణ్యేశ్వర స్వామి పాత్ర అని టాలీవుడ్‌లో ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో నిర్మాత సూర్యదేవర నాగ వంశీ అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చారు. ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ ప్రమోషన్‌లో భాగంగా తాజాగా తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌లతో మైథాలజీ సినిమా చేస్తున్నాం. ఆ సినిమా చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతుంది. మన పురాణల్లో ఉన్న ఓ దేవుడి గురించి చూపించబోతున్నాం. అందరికీ తెలిసిన దేవుడు ఆయన. ఆయన కథతో ఈ సినిమా చాలా గ్రాండ్‌గా ఉండబోతుంది’ అని తెలిపారు. కాగా, అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు బాక్సాఫీసు వద్ద ఎంతటి ఘన విజయాలు నమోదు చేశాయో తెలిసిన విషయమే. తాజాగా నాగవంశీ ప్రకటనతో వీరిద్దరి సినిమాపై అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి.

Updated Date - Mar 26 , 2025 | 02:46 AM