ఇక్కడే స్థిరపడాలని అనిపిస్తోంది

ABN , Publish Date - Mar 27 , 2025 | 03:29 AM

టాలీవుడ్‌లో స్థిరపడాలని ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌. ఆయన హీరోగా తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో...

టాలీవుడ్‌లో స్థిరపడాలని ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌. ఆయన హీరోగా తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘జాట్‌’. తెలుగు నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్స్‌ మీడియా సంయుక్తంగా నిర్మించాయి. ఏప్రిల్‌ 10న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ని ముంబైలో రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సన్నీ డియోల్‌ మాట్లాడుతూ ‘బాలీవుడ్‌ నిర్మాతలు టాలీవుడ్‌ వాళ్లని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకసారి స్ర్కిప్ట్‌ లాక్‌ అయితే పూర్తిగా దర్శకుడిపైనే నమ్మకం ఉంచుతారు. టాలీవుడ్‌ వాళ్లతో కలసి పనిచేయడం నాకు నచ్చింది.. నేను సౌత్‌ వాళ్లతో మరో సినిమా చేయాలనుకుంటున్నా. ఇక్కడే స్థిరపడాలని కూడా అనిపిస్తోంది’ అని అన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 03:29 AM