సరికొత్త పాత్రలో...
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:47 AM
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుహాస్. ఆయన కథానాయకుడిగా మరో కొత్త చిత్రం పట్టాలెక్కనుంది. గోపీ ఆచార దర్శకత్వంలో...
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుహాస్. ఆయన కథానాయకుడిగా మరో కొత్త చిత్రం పట్టాలెక్కనుంది. గోపీ ఆచార దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి నిర్మించనున్నారు. సోమవారం, ఈ చిత్రాన్ని ప్రకటించిన సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ ‘‘సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. సుహాస్ పాత్ర చాలా కొత్తగా ఉండబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. సినిమాకు సంబంధించిన ఇతర తారాగణాన్ని, సాంకేతిక సిబ్బందిని త్వరలోనే ప్రకటిస్తాం’’ అని తెలిపారు. ప్రస్తుతం ‘ఓ భామా అయ్యోరామ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు సుహాస్.