సమంత శుభం కార్డు

ABN , Publish Date - Mar 16 , 2025 | 05:42 AM

కథానాయిక సమంత చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె సొంత నిర్మాణ సంస్థ ‘త్రలాలా మూవింగ్‌ పిక్చర్స్‌’...

కథానాయిక సమంత (Samantha) చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె సొంత నిర్మాణ సంస్థ ‘త్రలాలా మూవింగ్‌ పిక్చర్స్‌’ బ్యానర్‌పై తొలి సినిమాగా తెరకెక్కిన ‘శుభం’ చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రానికి వసంత్‌ మరిగంటి కథను అందించగా, ‘సినిమా బండి’ ఫేమ్‌ ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహించారు. సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్‌ పెరి, షాలిని కొండేపూడి, శ్రావణి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.

Updated Date - Mar 16 , 2025 | 10:18 AM