వీరుడు విక్రమ్
ABN , Publish Date - Mar 16 , 2025 | 05:39 AM
విక్రమ్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘వీర ధీర సూరన్ 2’. ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో రియా శిబు నిర్మించారు...
విక్రమ్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘వీర ధీర సూరన్ 2’. ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో రియా శిబు నిర్మించారు. ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడు, దుషార విజయన్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 27న సినిమా విడుదలవుతోంది. శనివారం టీజర్‌ను విడుదల చేశారు. బలమైన శత్రువుతో తలపడిన సామాన్యుడి కథగా రూపుదిద్దుకున్న చిత్రమిదని తెలుస్తోంది. యాక్షన్ ఘట్టాలు, సంభాషణలు, విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. సంగీతం: జీవి ప్రకాశ్‌కుమార్.