కొత్త షెడ్యూల్‌లో...
ABN , Publish Date - Mar 06 , 2025 | 05:17 AM
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఎస్‌ఎ్‌సఎమ్‌బీ29’...
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఎస్‌ఎ్‌సఎమ్‌బీ29’ (వర్కింగ్ టైటిల్). చిత్రీకరణ ఇటీవలె ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. ఒడిస్సాలోని కోరపుట్‌లో రెండో షెడ్యూల్ మొదలైంది. ఈ నెలాఖరు వరకూ ఈ షెడ్యూల్ సాగనుంది. సినిమాలోని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు. మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా గురువారం ఒడిస్సాకు చేరుకుంటారట. కాగా, దాదాపు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని 2027లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు.