ప్రాధాన్యమున్న పాత్ర నాది
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:20 AM
‘నా క్యారెక్టర్ పేరు మృదుల. అర్జున్ సర్కార్ పాత్రకు భిన్నంగా ఉంటుంది. ఎంతో ప్రాధాన్యమున్న పాత్ర నాది. నిజానికి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యం ఉండదు. దర్శకుడు శైలేష్ కొలను...
‘నా క్యారెక్టర్ పేరు మృదుల. అర్జున్ సర్కార్ పాత్రకు భిన్నంగా ఉంటుంది. ఎంతో ప్రాధాన్యమున్న పాత్ర నాది. నిజానికి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యం ఉండదు. దర్శకుడు శైలేష్ కొలను చాలా తెలివైన రచయిత. మీరు ‘హిట్’, ‘హిట్-2’ సినిమాలు గమనిస్తే ఒక్కో సినిమాకి హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌లో ప్రాధాన్యం పెరుగుతుంది’ అని అన్నారు కథానాయిక శ్రీనిధి శెట్టి. నాని, శ్రీనిధి జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. వాల్ పోస్టర్ సినిమా, నాని యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మే 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీనిధి మీడియాతో మాట్లాడుతూ ‘నానితో పనిచేయడం ఓ అద్భుతమైన అనుభవం. ఈ సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. ఓ కన్నడ అమ్మాయిలా కాకుండా తెలుగు అమ్మాయిలానే డబ్బింగ్ చెప్పా. దర్శకుడు సినిమాను చక్కగా తెరకెక్కించారు. మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతం అందించారు. మొదటి పాట ప్రేమ వెల్లువ సూపర్ హిట్ అయింది. అలాగే అనిరుధ్ పాడిన పాట కూడా ఆదరణ పొందుతోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది’ అని తెలిపారు.
సీత పాత్రను వద్దనలేదు
‘రామాయణ్’ చిత్రంలో సీత పాత్రలో నటించే అవకాశం వస్తే తిరస్కరించానని మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయి. నేను సీత క్యారెక్టర్ కోసం ఆడిషన్ ఇచ్చాను. ఆ తర్వాత మేకర్స్ నుంచి ఎలాంటి పిలుపు రాలేదు. అసలు అలాంటి క్యారెక్టర్‌ని రిజెక్ట్ చేసే యాక్టర్‌ని కాదు నేను. ఫైనల్‌గా ఆ పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేశారని మీడియా ద్వారానే తెలుసుకున్నాను.