ఆకట్టుకునే ఓ తండ్రి కథ
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:49 AM
దిగ్గజ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ కీలకపాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ‘లైఫ్’(లవ్ యువర్ ఫాదర్). పవన్ కేతరాజు దర్శకత్వంలో...
దిగ్గజ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ కీలకపాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ‘లైఫ్’(లవ్ యువర్ ఫాదర్). పవన్ కేతరాజు దర్శకత్వంలో కిషోర్ రాఠీ, మహేశ్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మించారు. శ్రీహర్ష, కషిక క పూర్ జంటగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈనెల 4న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘చరణ్ సహకారం వల్ల సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాలో తండ్రి గొప్పదనాన్ని అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాం’ అన్నారు. మన జీవితాలతో ముడిపడిన అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని తెరకెకించిన చిత్రం ఇదని చరణ్ చెప్పారు.