LYF: 'లైఫ్'తో ఎస్పీ చరణ్ రీ ఎంట్రీ
ABN , Publish Date - Mar 29 , 2025 | 07:55 PM
దివంగత లెజెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం తనయుడు సింగర్ SP చరణ్ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ తెరపై సందడి చేయబోతున్నారు. 'లైఫ్' (లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు.
దివంగత లెజెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం తనయుడు సింగర్ SP చరణ్ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ తెరపై సందడి చేయబోతున్నారు. 'లైఫ్' (లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మాతలుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా SP చరణ్, నవాబ్ షా, ప్రవీణ్ ముఖ్య పాత్రలు పోషించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరయ్యారు.
మల్లా రెడ్డి మాట్లాడుతూ "ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో తీశారని తెలిసి ఆశ్చర్యపోయా అన్నారు. హీరో శ్రీ హర్ష తమిళ హీరో విజయ్ కంటే స్మార్ట్ గా ఉన్నాడు. ట్రైలర్ బావుంది. ప్రవీణ్ కేతరాజు చక్కగా తెరకెక్కించారని తెలుస్తోంది" అని అన్నారు.
డైరెక్టర్ పవన్ మాట్లాడుతూ " చక్కని కథతో రూపొందుతున్న చిత్రమిది. చరణ్ గారి ప్రతి షాట్ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశారు. బాలు గారు లేని లోటు చరణ్ తో తీరిపోయింది. సినిమా అందరిని అలరిస్తుంది" అన్నారు
SP చరణ్ మాట్లాడుతూ "ఇందులో నా పాత్ర అద్భుతంగా ఉంది. శ్రీ హర్ష ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డారు, వారణాసిలో ఆయన పడ్డ కష్టాన్ని కళ్లారా చూసా . ఈ సినిమాతో శ్రీ హర్షకి మంచి సక్సెస్ రావాలి" అన్నారు.
నిర్మాత కిషోర్ మాట్లాడుతూ "త్రండ్రి కథతో తెరకెక్కిన చిత్రమిది. అందరికి నచ్చుతుంది. పాటలు, సంగతం బాగ కుదిరాయి. కాస్ట్యూమ్ డిజైనర్ భావన పోలేపల్లి తన డిజైనింగుతో సినిమాకే గ్లామర్ తెచ్చారు. చక్కని కాస్ట్యూమ్స్ అందించారు త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం" అన్నారు.