Asish gandhi: ఆశిష్ గాంధీ నూతన చిత్రం ప్రారంభం
ABN , Publish Date - Mar 03 , 2025 | 03:01 PM
ఆశిష్ గాంధీ(Aashish gandhi), మానస రాధాకృష్ణన్(Manasa Radhakrishnan) జంటగా నటిస్తున్న చిత్రం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది.
ఆశిష్ గాంధీ(Aashish gandhi), మానస రాధాకృష్ణన్(Manasa Radhakrishnan) జంటగా నటిస్తున్న చిత్రం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ క్లాప్ కొట్టగా తొలి షాట్ ను దేవుని పటాలపై చిత్రీకరించారు. దర్శకులు వీరశంకర్, నవీన్ ఎర్నేని, తనికెళ్ల భరణి చిత్ర దర్శక ద్వయం కిట్టి కిరణ్(Kitti kiran), లక్ష్మీ చైతన్య (Lakshmi Chaitanya)లకు స్క్రిప్ట్ ను అందించారు. టి ప్రసన్న కుమార్ టి, వంశీ కెమెరా స్విచ్చాన్ చేశారు.
నిర్మాత ఆర్ యు రెడ్డి మాట్లాడుతూ "మా బ్యానర్ నుండి వస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకులతో మంచి కథతో సినిమా షూటింగ్ ను మార్చి 6 నుండి తొలి షెడ్యూల్ ను ఊటీ లో ప్రారంభిస్తున్నాం. రెండో షెడ్యూల్ ను హైదరాబాద్ లో ఉంటుంది. సోనుధి సంస్థ నుండి ఏడాదికి కొన్ని సినిమాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
దర్శకులు కిట్టి కిరణ్, లక్ష్మీ చైతన్యలు మాట్లాడుతూ- మా టాలెంట్ ను నిరూపించుకునే అవకాశం కల్పించిన నిర్మాత ఆర్ యు రెడ్డి గారికి కృతజ్ఞతలు. సినిమాను గొప్పగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, సంధ్య జానక్, కెమెరా మెన్ జోషి తదితరులు పాల్గొన్నారు.