Sivakarthikeyans Madarasi Movie: విజువల్‌ వండర్‌

ABN , Publish Date - Apr 15 , 2025 | 04:16 AM

శివకార్తీకేయన్ హీరోగా ఏ.ఆర్‌. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న "మదరాసి" చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కొత్త అనుభూతిని కలిగించనుంది

‘అమరన్‌’తో సూపర్‌హిట్‌ అందుకున్న తమిళ నటుడు శివకార్తీకేయన్‌ నటిస్తున్న చిత్రం ‘మదరాసి’. ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో శ్రీలక్ష్మి మూవీస్‌ నిర్మిస్తోంది. రుక్మిణీ వసంత్‌ కథానాయిక. విద్యుత్‌ జామ్వాల్‌, బిజు మీనన్‌, షబీర్‌, విక్రాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. సెప్టెంబరు 5న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. విజువల్‌ వండర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, సినిమాటోగ్రాఫర్‌: సుదీప్‌ ఎలామోన్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

Updated Date - Apr 15 , 2025 | 04:17 AM