Shine Tom Chacko Escape: నార్కోటిక్‌ పోలీసుల నుంచి తప్పించుకున్న ‘దసరా’ విలన్‌

ABN , Publish Date - Apr 18 , 2025 | 01:05 AM

విన్సీ సోనీ ఆరోపించిన డ్రగ్స్‌ మత్తులో లైంగిక వేధింపులు వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ‘దసరా’ విలన్‌ షైన్‌ టామ్‌ చాకో, కొచ్చిలోని హోటల్‌లో డ్రగ్స్‌ రైడ్‌ నుంచి తప్పించుకున్నట్లు వార్తలు రావడంతో మలయాళ చర్చలు పెరిగాయి

ఓ మలయాళ నటుడు డ్రగ్స్‌ మత్తులో తనను లైంగికంగా వేధించాడని కథానాయిక విన్సీ సోనీ అలోషియస్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. అయునా ఆ నటుడి పేరు మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం విన్సి సోనీ ఆరోపణలు మాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఓ హోటల్‌లో జరిగిన డ్రగ్స్‌ రైడ్‌ నుంచి ‘దసరా’ చిత్రంలో విలన్‌గా నటించిన షైన్‌ టామ్‌ చాకో తప్పించుకుని పారిపోయినట్లు వచ్చిన వార్తలు తీవ్ర కలకలం సృష్టించాయు. కొచ్చిలోని ఓ హోటల్‌లో డ్రగ్స్‌ వినియోగిస్తున్నారన్న సమాచారం రావడంతో నార్కోటిక్‌ పోలీసుల బృందం రైడ్‌ చేసింది. ఆ దాడి జరగడానికి కొద్దిసేపటి క్రితం షైన్‌ టామ్‌ మూడో అంతస్తు కిటికీ నుంచి రెండో అంతస్తులోకి దూకి అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా పారిపోయినట్లు తెలుస్తోంది. అతడు ముందస్తు సమాచారంతోనే పారిపోయి ఉంటాడని మాలీవుడ్‌లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో విన్సీ సోనీ ఆరోపించిన ఆ మలయాళ నటుడు షైన్‌ టామ్‌ అయ్యుంటాడనే ఊహాగానాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - Apr 18 , 2025 | 01:06 AM