మరోసారి జంటగా
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:22 AM
శర్వానంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘శర్వా 38’ అనేది వర్కింగ్ టైటిల్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందీ చిత్రం. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది...
శర్వానంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘శర్వా 38’ అనేది వర్కింగ్ టైటిల్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందీ చిత్రం. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. 1960ల కాలంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో శర్వా సరసన అనుపమ పరమేశ్వరన్ నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆమెను టీమ్ లోకి ఆహ్వానిస్తూ పోస్ట్ పెట్టారు. 1960ల కాలానికి తగ్గ దుస్తులను ధరించారు అనుపమ. ఈ పాన్‌ఇండియా ప్రాజెక్టును కే.కే.రాధామోహన్ నిర్మిస్తున్నారు. సౌందర్‌రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కాగా, శర్వా, అనుమప కలసి 2017లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘శతమానం భవతి’ సినిమాలో నటించారు.