ట్రెండ్‌కు తగ్గ చిత్రం

ABN , Publish Date - Mar 26 , 2025 | 02:35 AM

వేణుగోపాల్‌, పార్థు, అనూష జైన్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘సీతన్నపేట్‌ గేట్‌’. వై.రాజ్‌కుమార్‌ దర్శకత్వంలో ఆర్‌.శ్రీనివాస్‌ నిర్మించారు...

వేణుగోపాల్‌, పార్థు, అనూష జైన్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘సీతన్నపేట్‌ గేట్‌’. వై.రాజ్‌కుమార్‌ దర్శకత్వంలో ఆర్‌.శ్రీనివాస్‌ నిర్మించారు. ఏప్రిల్‌ 4న సినిమా విడుదలవుతోంది. మంగళవారం, చిత్రబృందం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ ‘‘ఇప్పటి ట్రెండ్‌కు సరిపోయే చిత్రమిది. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘మానవ సంబంధాల చుట్టూ తిరిగే కథ ఇది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించాం. ఊహించని మలుపులతో సినిమా ఉంటుంది’’ అని చిత్రదర్శకుడు వై.రాజ్‌కుమార్‌ చెప్పారు. ‘‘బలమైన కంటెంట్‌తో రూపొందిన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ అందరినీ ఆకట్టుకుంటుంది’’ అని నిర్మాత ఆర్‌.శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - Mar 26 , 2025 | 02:35 AM