Hero Priyadarshi: యాక్టర్‌నే కానన్నారు
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:05 AM
హీరో ప్రియదర్శి కథానాయకుడిగా నటించిన 'సారంగపాణి జాతకం' సినిమా ద్వారా సాధారణ మనిషి జీవితం చూపించబోతున్నారు. నటుడిగా తాను ఎదుగుతానన్న నమ్మకంతో ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పారు
Hero Priyadarshi: ‘ఇండస్ట్రీలోకి రాకముందు నా జాతకం చూపిస్తే ‘నువ్వు యాక్టర్‌వి కాలేవు’ అని చెప్పారు. నేను అవన్నీ పట్టించుకోలేదు. మా అమ్మ తన కొడుకు ఏమైపోతాడో అని అలా జాతకం చూపించారు. కానీ నేను నా మీద నమ్మకంతో ఇండస్ట్రీలోకి వచ్చాను. చేసే పని మీద నమ్మకం పెట్టుకుంటున్నానంతే’ అని అన్నారు హీరో ప్రియదర్శి. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఈ శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా ప్రియదర్శి మీడియాతో మాట్లాడుతూ ‘కామన్ మ్యాన్ పాత్ర ఎక్కువ మందికి కనెక్ట్ అవుతుందని నా నమ్మకం. ‘మల్లేశం’, ‘సారంగపాణి’ లాంటి సగటు జీవి పాత్రలను మన చుట్టూ చూస్తుంటాం. ఓ కామన్ మ్యాన్ కథే ఈ సినిమా. జాతకాలు నమ్మాలి అని కానీ, నమ్మకూడదు అని కానీ మేం చెప్పలేదు. ఒకరి నమ్మకాలను ఇంకొకరి మీద రుద్దితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపించాం’ అని చెప్పారు.