సందేశంతో వినోదం
ABN , Publish Date - Mar 06 , 2025 | 04:59 AM
యువతను ఆకట్టుకునే చక్కని ప్రేమకథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్నారు...
యువతను ఆకట్టుకునే చక్కని ప్రేమకథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్నారు. సంజీవ్‌రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్నారు. తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్ కీలకపాత్రలు పోషించారు. చిత్రబృందం నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు సందీ్‌పరెడ్డి వంగా ‘సంతాన ప్రాప్తిరస్తు’ చిత్రం టీజర్‌ను విడుదల చేసి, సినిమా ఘన విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఈతరం యువత ఎదుర్కొంటున్న సంతాన లేమి సమస్యను ఇతివృత్తంగా చేసుకొని రూపొందించిన సినిమా ఇదని దర్శకుడు తెలిపారు. మంచి సందేశంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఉన్న చిత్రమిదని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ: మహిరెడ్డి పండుగుల