Sankranthiki Vasthunnam: వెంకీమామ కొట్టాడయ్యా హిట్టు.. ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్!
ABN , Publish Date - Jan 15 , 2025 | 04:11 PM
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా థియేటర్లలో సంక్రాంతి కళ తెచ్చేసింది. ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ ఈ సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. దీంతో వెంకీమామ కెరీర్‌లోనే ఇప్పటి వరకు లేని విధంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కలెక్షన్స్‌ని కొల్లగొడుతోంది. తాజాగా ఈ మూవీ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుపుతూ మేకర్స్ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
‘సైంధవ్’తో పోయింది.. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో వచ్చింది అన్నట్లుగా వెంకీమామ బాక్సాఫీస్‌పై ‘సంక్రాంతి’ జాతర చేస్తున్నారు. ఈ సంక్రాంతి బరిలో చివరి చిత్రంగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబడుతూ.. వెంకీమామ కెరీర్‌లోనే తొలి రోజు ది బెస్ట్ ఫిగర్‌ని రాబట్టింది. తాజాగా ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లు సాధించిందో తెలుపుతూ.. మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ చూసి వెంకీ ఫ్యాన్స్ అంతా సంక్రాంతి విన్నర్ మా వెంకీనే అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read-Sankranthiki Vasthunnam Review: వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఎలా ఉందంటే
విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్‌లో హిట్ మెషీన్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. తొలి ఆట నుండే బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంటూ.. అన్ని రకాల ఆడియెన్స్‌ని థియేటర్ బాట పట్టిస్తోంది. ఫలితంగా మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. వెంకటేష్ కెరీర్‌లో ఇదే అత్యధిక, అత్యుత్తమ ఓపెనింగ్ కావడం విశేషం.
కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని మొదటి రోజే వన్ మిలియన్ మార్క్‌కు చేరువైనట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కుటుంబ కథా నేపథ్యం కావడంతో పాటు, కంటెంట్‌కు సరిపడిన పాత్రలు, హాస్యం, డ్రామా అన్నీ కూడా సమపాళ్లలో సెట్ కావడంతో.. ప్రేక్షకులకు ఈ సంక్రాంతికి ది బెస్ట్ ఛాయిస్‌గా ఈ సినిమా మారింది. వెంకటేష్ తనదైన కామెడీతో పాటు అనిల్ రావిపూడి ఈ సినిమాను పూర్తి వినోదాత్మక చిత్రంగా తీర్చిదిద్దడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. మొదటి రోజు కంటే కూడా రెండో రోజు ఈ సినిమాకు ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. చూస్తుంటే.. వెంకీమామ ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మ్యాజిక్ చేసేలానే ఉన్నారు. చూద్దాం.. పైనల్‌గా ఈ సినిమా రన్ ఎక్కడ వరకు పోతుందో..