Sampoornesh Babu New Film: అన్నాదమ్ముల అనుబంధం

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:43 AM

అన్నాదమ్ముల అనుబంధం నేపథ్యంగా సంపూర్ణేశ్‌బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సోదరా’ చిత్రం ఈ నెల 25న విడుదలవుతుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ట్రైలర్‌ను దర్శకులు సాయిరాజేశ్‌, నిర్మాత ఎస్‌కేఎన్‌ విడుదల చేశారు

అన్నాదమ్ముల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘సోదరా’. సంపూర్ణేశ్‌బాబు కథానాయకుడు. సంజోష్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రాచీబంసాల్‌, ఆరతి గుప్తా కథానాయికలు. మోహన్‌ మేనంపల్లి దర్శకుడు. ఈ నెల 25న ఈ చిత్రం విడుదలవుతోంది. ఇటీవలే చిత్రబృందం నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు సాయిరాజేశ్‌, నిర్మాత ఎస్‌కేఎన్‌ ‘సోదరా’ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంపూర్ణేశ్‌బాబు మాట్లాడుతూ ‘అన్నాదమ్ముల అనుబంధాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించాం. నా నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రను ఈ చిత్రంలో పోషించాను’ అని చెప్పారు. బాబూమోహన్‌లాంటి సీనియర్‌ నటుడితో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చిందని సంజోష్‌ తెలిపారు. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నాం అని బాబూమోహన్‌ తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ ‘బ్రో’ చిత్రంలా ‘సోదరా’ కూడా మంచి విజయం అందుకోవాలని ఎస్‌కేఎన్‌ ఆకాంక్షించారు. సంపూ కెరీర్‌లో ఈ చిత్రం మైలురాయిగా నిలవాలని సాయిరాజేశ్‌ కోరుకున్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:44 AM