మేలో శుభం విడుదల
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:28 AM
హీరోయిన్ సమంత తన సొంత బేనర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బేనర్‌పై నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. శుక్రవారం చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది...
హీరోయిన్ సమంత తన సొంత బేనర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బేనర్‌పై నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. శుక్రవారం చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. మే 9న ‘శుభం’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. మన జీవితాలతో ముడిపడిన అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని ప్రేక్షకులను ఆకట్టుకొనే అన్ని అంశాలతో తెరకెక్కించిన చిత్రమిదని యూనిట్ తెలిపింది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. హర్షిత్‌రెడ్డి, శ్రియా కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, క్లింటన్ సెరజో