Samantha: నాకు నచ్చినట్టు జీవిస్తా

ABN , Publish Date - Mar 29 , 2025 | 03:49 AM

నాకు నచ్చినట్టు జీవిస్తారూల్స్‌ పెడితే అస్సలు నచ్చదు అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు సమంత.

- సమంత

‘నాకు నచ్చినట్టు జీవిస్తా.. రూల్స్‌ పెడితే అస్సలు నచ్చదు’ అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు సమంత. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. ప్రస్తుతం సమంత సిడ్నీలో పర్యటిస్తున్నారు. అక్కడ నిర్వహించిన ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న సమంత మాట్లాడుతూ ‘నాకు ఇష్టమైన రంగంలో రాణించాలన్నదే నా ఆశ. ఆడపిల్లనని ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇలా ఉండు, అలా ఉండు అంటూ రూల్స్‌ పెడితే నాకు నచ్చదు. అన్ని రకాల పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించాలి. అదే నా సక్సె్‌సగా భావిస్తా’ అని అన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 03:49 AM