Actress Samantha: అందుకే ఆ పోస్ట్‌కు లైక్ కొట్టిందా
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:28 AM
భర్తలు జీవిత భాగస్వామిని అనారోగ్యం కారణంగా వదిలే పరిస్థితిని చూపిన ఓ పోస్ట్‌కు సమంత లైక్ చేయడం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు దీన్ని ఆమె వ్యక్తిగత జీవితానికి అనుసంధానం చేస్తున్నారు
సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే తారల్లో సమంత ఒకరు. ఆరోగ్యం, వ్యక్తిత్వం, మహిళా సాధికారత, వర్క్‌లైఫ్ తదితర విషయాలను తరచూ ఇన్‌స్టా పోస్ట్స్ లేదా స్టోరీస్ ద్వారా షేర్ చేస్తుంటారు ఆమె. తాజాగా, ఓ ఇన్‌స్టా పేజీలోని పోస్ట్‌ను ఆమె లైక్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓ సర్వే ఆధారంగా భార్యభర్తల మధ్యనున్న అనుబంధాన్ని తెలిపే పోస్ట్ అది. ‘జీవిత భాగ్యస్వామి అనారోగ్యానికి గురైతే భర్త ఆమెను వదిలేయడానికి సిద్ధపడుతున్నాడు. కానీ, భార్య అలా కాదు. భర్తకు ఎలాంటి అనారోగ్యం ఉన్నా, అతన్ని వదులుకోవడానికి ఇష్టపడదు. భార్యతో ఎమోషనల్ అటాచ్‌మెంట్ లేకపోవడం వల్లే భర్త ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు’ అన్నది ఆ పోస్ట్ సారాంశం. ఇది చూసిన నెటిజన్లు ఆమె వ్యక్తిగత జీవితంతో ఈ పోస్ట్‌కు ముడిపెడుతున్నారు. కాగా, నిర్మాతగా సమంత రూపొందించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న విడుదల కానుంది.