Samantha Latest Interview: కోట్ల రూపాయలు వదులుకున్నా
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:15 AM
సమంత తన ఇటీవలివైన ఇంటర్వ్యూలో మానసిక ఆరోగ్యం, బ్రాండ్ అంబాసిడర్‌గా తన పాత్రపై మాట్లాడారు. కోట్ల రూపాయల చెల్లింపు వచ్చినా, వివేకపూర్వకంగా 15 బ్రాండ్లను వదిలించుకున్నట్లు వెల్లడించారు
సమంత
మహిళా సాధికారతపై తరచూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ మహిళలను చైతన్య పరుస్తున్నారు నటి సమంత. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మానసిక ఆరోగ్యం, వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయడం గురించి మాట్లాడారు. కోట్ల రూపాయల డబ్బు వస్తున్నప్పటికీ వాటిని పక్కన బెట్టడం వెనుక బలమైన కారణం ఉందన్నారు. ‘20 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పట్లో ఎన్ని సినిమాలు చేశాం. ఎన్ని బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నాం అనేదానిపైనే సక్సె్‌సని నిర్ణయించేవారు. నిజానికి ఆ సమయంలో ఎన్నో బహుళజాతి కంపెనీల ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరించా. అది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. కానీ ఇప్పుడు నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని తెలుసుకున్నా. ఒకప్పుడు పెద్దగా ఆలోచించకుండా కొన్ని బ్రాండ్లకు ప్రమోషన్స్ చేశా. అందుకు ఇప్పుడు సారీ చెబుతున్నా. కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్దపడినా ఏడాది కాలంలో 15 బ్రాండ్లు వదులుకున్నా. ఇప్పటికీ చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ నేను అంగీకరించడం లేదు. నాకు తెలిసిన వైద్యులను సంప్రదించి సదరు బ్రాండ్లతో ఎలాంటి హానీ లేదనిపిస్తేనే ప్రమోట్ చేస్తున్నా’ అని సమంత తెలిపారు.