ఫలితాలు కూడా చెత్తగానే ఉంటాయి

ABN , Publish Date - Mar 28 , 2025 | 02:27 AM

చెత్త సినిమాలు తీస్తే ఫలితాలు కూడా చెత్తగానే ఉంటాయి అంటూ.. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన నటించిన తాజా చిత్రం...

చెత్త సినిమాలు తీస్తే ఫలితాలు కూడా చెత్తగానే ఉంటాయి అంటూ.. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సికందర్‌’ ఈనెల 30న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ‘సరైన చిత్రాలు తెరకెక్కించలేనప్పుడు అవి బాక్సాఫీసు వద్ద పరాజయాలే మూటగట్టుకుంటాయి. అందరూ కలసి కష్టపడితేనే మంచి సినిమా వస్తుంది. అయినప్పటికీ హీరో ఫొటోను మాత్రమే పోస్టర్‌లో వేస్తారు. ప్రేక్షకులు కూడా అది చూసే థియేటర్లకు వస్తుంటారు. ఒకవేళ సినిమా ఫ్లాప్‌ అయితే అందరూ ఆ హీరోనే తప్పుపడతారు’ అని సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - Mar 28 , 2025 | 02:27 AM