సాయికుమార్‌కు అవార్డు

ABN , Publish Date - Mar 24 , 2025 | 03:50 AM

సాయికుమార్‌ కుమరం భీం జాతీయ అవార్డును అందుకున్నారు. ఆదివారం ఆషిఫాబాద్‌లో భారత్‌ కల్చర్‌ అకాడమీ, ఆదివాసీ సాంస్కృతిక పరిషత్‌, ఓం సాయితేజ ఆర్ట్స్‌ ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశాయి.

ఆసిఫాబాద్‌ (ఆంధ్రజ్యోతి)

నటుడు సాయికుమార్‌ కుమరం భీం జాతీయ అవార్డును అందుకున్నారు. ఆదివారం ఆషిఫాబాద్‌లో భారత్‌ కల్చర్‌ అకాడమీ, ఆదివాసీ సాంస్కృతిక పరిషత్‌, ఓం సాయితేజ ఆర్ట్స్‌ ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశాయి. జ్ఞాపికతో పాటు 50వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో భారత్‌ కల్చర్‌ అకాడమీ ఛైర్మన్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి పార్థసారధి, మాజీ మంత్రి, నటుడు బాబుమోహన్‌, ఆదిలాబాద్‌ ఎంపీ నగేష్‌, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 03:51 AM