Robinhood Movie Team: అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది

ABN , Publish Date - Mar 29 , 2025 | 03:59 AM

నితిన్‌, శ్రీలీల జంటగా రూపొందిన ‘రాబిన్‌హుడ్‌’ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌ను పొందుతోంది. దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్‌ సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేశారు

నితిన్‌, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘రాబిన్‌హుడ్‌’ చిత్రం శుక్రవారం విడుదలైంది. అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోందనీ, ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారనీ దర్శకుడు వెంకీ చెప్పారు. శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ ‘మేం రెండు థియేటర్స్‌కి వెళ్లాం. నితిన్‌ పెర్ఫార్మెన్స్‌తో పాటు రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ కామెడీ ట్రాక్‌ను చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు. అలాగే క్రైమాక్స్‌లో వచ్చే ఎమోషన్‌, ట్విస్టుల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. డేవిడ్‌ వార్నర్‌ ఎంట్రీకి థియేటర్‌ అదిరిపోయింది. ఆడియన్స్‌ రియాక్షన్‌ చూశాక చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఉగాదికి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. అందరూ థియేటర్‌కు వెళ్లి చూడండి’ అని కోరారు. నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్‌ మాట్లాడుతూ ‘థియేటర్‌కి వెళ్లి ఫ్యామిలీ, యూత్‌ ఎంజాయ్‌ చేసే సినిమా ఇది. ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రతి షో కీ కలెక్షన్లు పెరుగుతున్నాయి.. డిస్ట్రిబ్యూటర్స్‌ కూడా ఫోన్‌ చేసి బాగుందని చెబుతున్నారు. సినిమా కచ్చితంగా విన్నర్‌ అవుతుందని మా నమ్మకం’ అన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 04:01 AM