దర్శకుడు శంకర్‌కు ఊరట
ABN , Publish Date - Mar 12 , 2025 | 05:39 AM
తమిళ దర్శకుడు ఎస్.శంకర్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు చెందిన రూ.10.11 కోట్ల విలువ చేసే ఆస్తులను జప్తు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీసుకున్న...
ఈడీ దర్యాప్తుకు హైకోర్టు బ్రేక్
తమిళ దర్శకుడు ఎస్.శంకర్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు చెందిన రూ.10.11 కోట్ల విలువ చేసే ఆస్తులను జప్తు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు మంగళవారం తాత్కాలిక స్టే విధించింది. శంకర్ దర్శకత్వంలో ‘యందిరన్’ చిత్రం రాగా, ఈ మూవీ వ్యవహారంలో శంకర్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ ఈ సినిమా కోసం తీసుకున్న పారితోషికం ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అయితే, ఈడీ చర్యను సవాల్ చేస్తూ శంకర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన ధర్మాసనం... శంకర్ ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ జారీ చేసిన ఆదేశాలపై తాత్కాలిక స్టే విధించింది. ఈ వ్యవహారంలో ఈడీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 21వ తేదీకి వాయిదా వేసింది.
చెన్నై, మార్చి 11 (ఆంధ్రజ్యోతి)