Rana Daggubati: అరైవల్ హోటల్స్ ను ప్రారంభించిన రానా దగ్గుబాటి
ABN , Publish Date - Feb 16 , 2025 | 07:53 PM
మాదాపూర్, దుర్గం చెరువు సమీపంలో వర్మ స్టీల్ వారి అరైవల్ హోటల్స్ రానా దగ్గుబాటి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ, సినీ నిర్మాత సునీల్ నారంగ్, సినీ ఆర్టిస్టులు శ్రీనివాస్ రెడ్డి, శివాజీ, కృష్ణుడు, రజిత, భావన తదితరులు హాజరయ్యారు.
మాదాపూర్, దుర్గం చెరువు సమీపంలో వర్మ స్టీల్ వారి అరైవల్ హోటల్స్ (Arrival hotels) రానా దగ్గుబాటి (Rana Daggubati) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ, సినీ నిర్మాత సునీల్ నారంగ్, సినీ ఆర్టిస్టులు శ్రీనివాస్ రెడ్డి, శివాజీ, కృష్ణుడు, రజిత, భావన తదితరులు హాజరయ్యారు. ఈతరం హంగులతో అన్ని వసతులతో లగ్జరీ హాస్పిటాలిటీతో కూడిన ఈ హోటల్స్ ప్రారంభించడం ఆనందంగా ఉందని రానా అన్నారు. ఇది కేవలం ఒక హోటల్ కాదు గొప్ప అనుభవం. ఆతిథ్యం లో ఇంత ముందుచూపు తో కూడిన విధానాన్ని చూడటం ఆశ్చర్యంగా ఉంది. ఈ లాంచ్ లో భాగమైనందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను. ఇది హాస్పిటాలిటీ రంగానికి గేమ్-ఛేంజర్" అని రానా అన్నారు.
"అడ్వాన్స్డ్ స్మార్ట్ టెక్నాలజీ తో అత్యాధునిక గదులు & సూట్ రూమ్స్ మా ప్రత్యేకత అని, ప్రపంచ స్థాయి చెఫ్ లను కలిగి ఉన్న ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ సౌకర్యం ప్రత్యేక ఆతిధ్యం అని చైర్మన్ ఎ. వి. పి. వర్మ తెలిపారు.