Actress Rambha: మళ్ళీ మరోసారి అలరిస్తానంటున్న రంభ

ABN , Publish Date - Mar 01 , 2025 | 01:01 PM

మూడు దశాబ్దాల క్రితం కుర్రకారు గుండెల్లో తన సోయాలతో తిష్టవేసింది రంభ. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నాయికగా నటించిన రంభ ఇప్పుడు మరోసారి ఎంట్రీ ఇస్తానని అంటోంది.

1990లలో హీరోయిన్ రంభ (Rambha) పేరు ఎక్కువగా మార్మోగిపోయింది. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ, కన్నడ ఇలా అన్ని భాషల్లో రంభ కథానాయికగా తన ముద్ర వేశారు. నటిగా రంభ కెరీర్‌లో మరుపురాని సూపర్ హిట్ చిత్రాలెన్నో ఉన్నాయి. రంభ చేసిన గ్లామర్ రోల్స్ కు, గ్రేస్ ఫుల్ స్టెప్పులకు అప్పటి కుర్రకారు ఫిదా అయ్యేవారు. గత కొన్నేళ్లుగా రంభ సినీ పరిశ్రమకు, నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం రంభ రీ ఎంట్రీకి సిద్దంగా ఉన్నారు.


తాజాగా నటి రంభ తన రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ, ''నా ఫస్ట్ ఛాయిస్ ఎప్పుడూ సినిమా (Cinema)నే. ఇక ఇప్పుడు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు అయినా నేను సంసిద్దంగా ఉన్నాను. ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. కొత్త పాత్రలను ఎంచుకుని, మళ్లీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వాలని ఎదురు చూస్తున్నాను'' అని అన్నారు. దీంతో అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆమె రీ-ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రంభ రీ-ఎంట్రీ ఎలా ఉంటుందో.. ఆమెకు ఇప్పుడు తొలి అవకాశం ఎవరు ఇస్తారో చూడాలి.

Also Read: Dil Ruba: లవ్ వైబ్రేషన్ తో సాగిన 'కన్నా... నీ ప్రేమ సంద్రమే' గీతం

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 03 , 2025 | 08:44 AM