Ramana Gogula: రమణ గోగుల కంబ్యాక్ అదిరింది.. వెంటనే మరో పాట

ABN , Publish Date - Feb 26 , 2025 | 05:13 PM

సింగర్ రమణ గోగుల మళ్లీ  ఫామ్ లోకి వచ్చారు. 'సంక్రాంతికి వస్తున్నాం'  సినిమాలో 'గోదారి గట్టు మీద రామచిలక' కం బ్యాక్ ఇచ్చిన ఆయన తాజాగా మరో పాట పాడారు.

సింగర్ రమణ గోగుల (Ramana Gogula) మళ్లీ  ఫామ్ లోకి వచ్చారు. 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki VAstunnam) సినిమాలో 'గోదారి గట్టు మీద రామచిలక' కం బ్యాక్ ఇచ్చిన ఆయన తాజాగా మరో పాట పాడారు. 'నారి' (Naari movie) సినిమాలో అయన పాడిన  'గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే' సాంగ్ ను మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేశారు.  మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమని(Aamani) వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా ఇది. మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి, ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో 13-20 ఏళ్ల పిల్లలు ప్రమాదంలో ఉన్నారనే విషయాన్నిచెబుతూ దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. శశి వంటిపల్లి నిర్మించారు. (Ramana Gogula song for naari)

దర్శకుడు మాట్లాడుతూ "వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డిపై ఈ పాటను చిత్రీకరించాం.  రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని గోదారి గట్టు మీద..పాటతో సెన్సేషన్ సృష్టించిన రమణ గోగుల 'గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే' పాటను పాడటం విశేషం. వినోద్ కుమార్ విన్ను ఈ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. మహిళా సాధికారత గొప్పదనం చెప్పే కథాంశంతో తెరకెక్కుతున్న "నారి" సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన 'ఈడు మగాడేంట్రా బుజ్జి..', 'నిశిలో శశిలా..' సాంగ్స్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.  'గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే' పాట కూడా పెద్ద హిట్ కాబోతోంది. ఆర్పీ పట్నాయక్, సునీత, చిన్మయి శ్రీపాద వంటి పేరున్న గాయనీ గాయకులు "నారి" చిత్రంలోని సాంగ్స్ పాడటం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. 13-20 ఏళ్ల పిల్లలకు వారి తల్లిదండ్రులు తప్పక థియేటర్లలో చూపించాల్సిన చిత్రమిది" అని అన్నారు.  

Updated Date - Mar 04 , 2025 | 12:22 PM