రామ్‌చరణ్‌ ప్రోత్సాహం మరువలేనిది

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:50 AM

ప్రదీప్‌ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. దర్శకద్వయం నితిన్‌, భరత్‌ దర్శకత్వంలో నిర్మాణ సంస్థ మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ నిర్మించింది..

ప్రదీప్‌ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. దర్శకద్వయం నితిన్‌, భరత్‌ దర్శకత్వంలో నిర్మాణ సంస్థ మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ నిర్మించింది. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా మేకర్స్‌ ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్‌ మాచిరాజు మాట్లాడుతూ ‘‘అద్భుతమైన టీమ్‌ వర్క్‌కు నిదర్శనం ఈ సినిమా. రామ్‌చరణ్‌ ‘పెద్ది ఫర్‌ ప్రదీప్‌’ అని చెప్పడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన మా సినిమా మొదటి టికెట్‌ను కొని ప్రోత్సహించడం ఎప్పటికీ మర్చిపోలేని విషయం. ఈ సమ్మర్‌లో కుటుంబమంతా హాయిగా థియేటర్లో కూర్చుని నవ్వుకునేలా చేసే సినిమా ఇది’’ అని చెప్పారు. ‘‘రామాయణంలో ఉడతని శ్రీరాముడు ఎలా ఎలివేట్‌ చేశారో తెలిసిందే. అలాగే, మా చిత్రాన్ని రామ్‌చరణ్‌ శ్రీరాముడిలా ఎలివేట్‌ చేశారు’’ అని దర్శకుడు భరత్‌ చెప్పారు. ‘‘మొదలైన క్షణం నుంచి ఎండ్‌ టైటిల్స్‌ పడేదాకా వినోదాన్ని అందిస్తుందీ సినిమా’’ అని దర్శకుడు నితిన్‌ తెలిపారు.

Updated Date - Apr 11 , 2025 | 05:50 AM