శ్రీరామ నవమి కానుకగా
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:57 AM
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ కథానాయిక. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్...
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ కపూర్ కథానాయిక. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా గ్లింప్స్ రిలీజ్ డేట్‌పై అప్డేట్ ఇచ్చింది. శ్రీరామ నవమి కానుకగా ఫస్ట్ గ్లింప్స్‌ని ఈనెల 6న విడుదల చేస్తున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.