Ram Charan-Sandeep Vanga: క్రేజీ కాంబోలో మూవీ ఉందా... లేదా...
ABN , Publish Date - Apr 17 , 2025 | 07:22 PM
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నాడు ఓ సినీ కవి. టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఈగర్ గా వెయిట్ చేస్తున్న స్టార్ కాంబినేషన్లు చూస్తుండగానే ఛేంజ్ అయిపోతున్నాయి. హీరోల లైనప్స్ సడన్ గా మారిపోతున్నాయి. దాంతో వారి ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు.
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) అంటే ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్ లోనూ ఫుల్ హైప్ ఉంది. ''అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్'' సినిమాలతో ప్యాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. మార్కెట్‌లో ఇతని క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు 'స్పిరిట్' (Spirit) ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న ఈ క్రియేటివ్ మాస్టర్, ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తాడా అని ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. సమ్మర్ నుంచి రచ్చ స్టార్ట్ అవుతుందని బజ్ బాగా వినిపిస్తోంది. ఈ సందీప్ లైనప్‌లో 'యానిమల్ పార్క్' (Animal Park), అల్లు అర్జున్‌తో ఎ.ఎ.24 కూడా ఉన్నాయి. కానీ బన్నీ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్ళదని టాక్. అందుకే, ఆ గ్యాప్‌లో మరో క్రేజీ ప్రాజెక్టును లైన్ లోకి తీసుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది.
సందీప్ వంగ తన లైనప్ లో రామ్ చరణ్ ( Ram Charan) తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడనే వార్త కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై ఒక రౌండ్ డిస్కషన్స్ కూడా జరిగాయట. కానీ ఇది ఒక షేప్ లోకి రావడానికి, పట్టాలెక్కడానికి బాగానే టైం పట్టొచ్చు అంటున్నారు. మరోవైపు చెర్రీ - సుకుమార్ కాంబోలో ఆర్.సి. 17 అనుకున్నది ఆర్.సి. 18గా మారవచ్చని చెబుతున్నారు. ఆ స్లాట్‌లో డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్ (Nikhil Nagesh Bhat ) ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందని మరో రూమర్ కూడా హల్చల్ చేస్తోంది.
సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్'ను పూర్తి చేసే సమయానికి 'యానిమల్ పార్క్' కోసం రణబీర్ కపూర్ (Ranbir Kapoor) సిద్ధంగా ఉండాలి. కానీ ఆ హీరో రెండు భాగాల 'రామాయణం', 'లవ్ అండ్ వార్' (Love & War), ధూమ్ 4 (Dhoom 4) ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటాడు. సో, ఈ గ్యాప్‌లో సందీప్ - చరణ్ కాంబో సెట్ బాగానే ఉంటుంది. కానీ ఇవన్నీ పుకార్లేనని, ఇందులో వాస్తవం లేదని అంటున్నవారూ లేకపోలేదు. 'ట్రిపుల్ ఆర్' తర్వాత 'గేమ్ ఛేంజర్' కోసం మాగ్జిమమ్ టైమ్ ను చెర్రీ వెచ్చించాడు. కానీ దాని ఫలితం మాత్రం నిరాశను కలిగించింది. అందుకే ఇక మీద క్రేజీ కాంబో కంటే కూడా క్రేజీ కంటెంట్ కు రామ్ చరణ్ ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. చూద్దాం... ఏం అవుతుందో!
Also Read: Odela -2 Movie : ఓదెల 2 మూవీ రివ్యూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి