Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ ‘షష్టిపూర్తి’.. షాకైన ఇళయరాజా!

ABN , Publish Date - Jan 08 , 2025 | 09:04 PM

నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ ‘షష్టిపూర్తి’ అని చెప్పగానే ఇళయరాజా షాక్ అయ్యారట. ఈ విషయం ‘షష్టిపూర్తి’ గ్లింప్స్ లాంచ్ వేడుకలో నటకిరీటీ చెప్పుకొచ్చారు. ఇంకా ‘షష్టిపూర్తి’ గురించి ఆయన చెప్పిన విశేషాలు ఏంటంటే..

Rajendra Prasad and Archana

అవును రాజేంద్ర ప్రసాద్ ‘షష్టిపూర్తి’ అని తెలిసి మ్యాస్ట్రో ఇళయరాజా షాకయ్యారట. ఈ విషయం స్వయంగా నటకిరీటీనే చెప్పుకొచ్చారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. రూపేష్ హీరోగా, ఆకాంక్షా సింగ్ హీరోయిన్‌గా మా ఆయి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ సరసన రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకున్న సీనియర్ నటి అర్చన నటించారు. క్లాసిక్ ఫిల్మ్ ‘లేడీస్ టైలర్’ విడుదలైన 38 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి రూపేష్ చౌదరి నిర్మాత. ఈ చిత్ర గ్లింప్స్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో టీమ్ విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..


Rajendra-Prasad.jpg

‘‘షష్టిపూర్తి.. ఈ అదృష్టం నా ఒక్కడికేనా.. లేదంటే ఇంకెవరికైనా ఉందా? మీడియా వాళ్లని మీడియా మిత్రులు అని పిలవను.. మీడియా సోదరులు అనే పిలుస్తాను. ఎందుకంటే వారు కూడా ఎప్పటినుండో నాతో పాటు ట్రావెల్ అవుతున్నారు. వారంతా నాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే.. ఆ భగవంతుడు నాకిచ్చిన అదృష్టం అని అనుకుంటాను. అదృష్టం ఎందుకూ అంటే..? వయసుకు తగినట్లుగా పాత్రలు వస్తున్నందుకు. రాజేంద్ర ప్రసాద్‌కు షష్టిపూర్తి. నిజ జీవితంలో నాకు అరవై దాటిన తర్వాత షష్టిపూర్తి పెట్టకుండా తప్పించుకున్నాను. కానీ భగవంతుడు ఊరుకుంటాడా? ఇదిగో ఇలా షష్టిపూర్తి చేశాడు. ఇది సినిమా కాదు.. జీవితం. మీ అందరి ఇళ్లలోని వస్తువును అయిపోయాను. దేశానికి ప్రధానిగా చేసిన పీవీ నరసింహారావుగారు ఏమనేవారో తెలుసా.. ‘ఇంట్లో కంచం ఉంటాది.. మంచం ఉంటాది.. ప్రసాదు ఉంటాడు’ అని అనేవారు. నిజంగా నేను ‘ఆ నలుగురు’ తర్వాత చేసిన సినిమాలు భగవంతుడు వేసిన భిక్ష అనే అనుకోవాలి.

Also Read-Kabir Duhan Singh: పేరుకే విలన్.. ఈ నటుడు చేసేది తెలిస్తే ఫ్యాన్ అయిపోతారు


షష్టిపూర్తి సినిమాలో పనిచేసిన వారంతా ఎంతో గర్వపడతారు. ఎందుకంటే, సినిమా మారిపోయింది. సినిమా ఇంటికి వచ్చేసింది. ఓటీటీలో రూపంలో ఇంట్లోకి వచ్చేసింది. థియేటర్ల నుండి ఇంటికి వచ్చేసింది. ఒకప్పుడు నా సినిమాల గురించి ఏం మాట్లాడుకునే వారంటే.. ఇది రాజేంద్రపసాద్ సినిమానా? అయితే కారు పెట్టడానికి ప్లేస్ ఉండదండి. ఫ్యామిలీల ఫ్యామిలీలు సినిమాలకు వస్తారనేవారు. ఒక టికెట్ తెగే దగ్గర 10, 12 టికెట్లు తెగేవని అనేవారు. నిజంగా అది నిజమైతే.. ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూడాలి. తల్లిదండ్రుల పెళ్లి చూసే అవకాశం బిడ్డలకు ఉండదు. కానీ పిల్లలు చూడగలిగిన పెళ్లి ఏదైనా ఉందీ అంటే అది షష్టిపూర్తి ఒక్కటే. ప్రతి మనిషికి షష్టిపూర్తి చాలా ముఖ్యం. ఒక అద్భుతమైన సినిమా చేసే అవకాశాన్ని నాకు కల్పించాడు దర్శకుడు పవన్. ఇళయరాజా, కీరవాణి, చైతన్యప్రసాద్ వంటి వారంతా ఈ సినిమాకు పనిచేశారు. నిర్మాతగా రూపేష్ అందరినీ బాగా చూసుకున్నాడు.


ఇందులో నటించిన వారందరికీ నా మీద ఎంతో ప్రేమ, గౌరవం ఉంది. అప్పటి బ్రహ్మానందం నుండి ఇప్పటి చంటి వరకు అందరికీ నేనంటే గౌరవం. సెట్స్‌లో కూడా చాలా చక్కటి వాతావరణం ఉండేది. హీరోగా రూపేష్ చాలా చక్కగా నటించాడు. చాలా నేర్చుకున్నాడు కూడా. ఆకాంక్ష నాతో ఇంతకు ముందు నా కుమార్తెగా నటించింది. అర్చన.. ‘లేడీస్ టైలర్’ సినిమా అప్పటికే ఆమె మెచ్యూర్డ్ నటి. నన్ను వంశీ ఎంతో భయపెట్టేవాడు. ఎన్నో సంవత్సరాల క్రితం నటించిన మేము.. మళ్లీ ఇలా కలుసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. మా ఇద్దరి పాత్రలు అద్భుతంగా ఉంటాయి. నాకు వర్క్ చేయడం రెస్పాన్సిబిలిటీ. నాకు పాత్ర దొరకడం అదృష్టం. ఇళయరాజా దగ్గరకి వెళ్లి.. రాజేంద్ర ప్రసాద్ ‘షష్టిపూర్తి’ అని చెప్పగానే ఆయన కూడా షాక్ అయ్యారట. షష్టిపూర్తి ఒక మంచికథ. తెలుగు వారి సంప్రదాయం, సంస్కృతిని ఇష్టపడేవారు.. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మన ఇళ్లలో ఏం ఉంటే సంతోషంగా ఉంటామనేది ఈ సినిమా చెబుతుంది.. అందరూ సినిమాని థియేటర్లలో చూడాలని కోరుతున్నాను’’ అని తెలిపారు.


Also Read-Ajith Kumar: రేసింగ్ సర్క్యూట్‌లో అజిత్ కారుకు ఘోర ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు

Also Read- Renu Desai: అలా ఎలా తీశారో.. ఆ సినిమా చూస్తూ ఏడ్చేశా..

Also Read- Naga Vamsi: తప్పుగా మాట్లాడలేదు.. వివాదంపై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ

Also Read-Yearender 2024 ఆర్టికల్స్..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 08 , 2025 | 09:04 PM