వార్నర్‌కు రాజేంద్రప్రసాద్‌ క్షమాపణలు

ABN , Publish Date - Mar 26 , 2025 | 02:38 AM

ఆస్ట్రేలియన్‌ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌కు సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ క్షమాపణలు చెప్పారు. హీరో నితిన్‌- డేవిడ్‌ వార్నర్‌ నటించిన ‘రాబిన్‌హుడ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఇటీవల...

ఆస్ట్రేలియన్‌ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌కు సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ క్షమాపణలు చెప్పారు. హీరో నితిన్‌- డేవిడ్‌ వార్నర్‌ నటించిన ‘రాబిన్‌హుడ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ డేవిడ్‌ వార్నర్‌పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈవెంట్‌కు తాగి వచ్చారా? అంటూ రాజేంద్రప్రసాద్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్‌, డేవిడ్‌ వార్నర్‌కు బహిరంగ క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు. ‘నేను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ బాధించలేదు. నితిన్‌-వార్నర్‌ నాకు పిల్లల్లాంటి వారు. సరదాగా చేసిన ఆ వ్యాఖ్యల వల్ల ఎవరైనా ఇబ్బందిపడుంటే క్షమించండి’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 02:38 AM